

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజుల పాటు మహిళలందరూ ఆటపాటలతో, ఆనందోత్సాహాలతో ఈ పండుగను వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేకమైన సంప్రదాయమని పేర్కొన్నారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ఐక్యతకు నిదర్శనమని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ప్రజల సాంస్కృతిక వైభవం, మహిళల ఐక్యత, సామాజిక విలువలను చాటిచెప్పే ఈ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ప్రకృతిని ఆరాధించే తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణకు తమ ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. బతుకమ్మ సంబరాలు ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో పండుగను జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!