
జనరల్

కాక్రోచ్ జనతా పార్టీ (సీజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించారు. నీట్ పేపర్ లీక్, సీబీఎస్‌ఈ, సీయూఈటీ, ఎస్‌ఎస్‌సీ జీడీ పరీక్షల అవకతవకలపై సీజెపి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజెపి డిమాండ్ చేసింది. పెద్ద సంఖ్యలో యువత నిరసనలో పాల్గొనగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు శాంతియుతంగా నిరసన కొనసాగుతుందని పార్టీ తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!