
జనరల్

ద్వారకాతిరుమల ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం వెలుగులోకి వచ్చింది. ఏలూరులోని ఈ ప్రసిద్ధ ఆలయంలో ఓ వ్యక్తి స్వామివారి మూలవిరాట్‌తో పాటు ఆలయం లోపల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం కలకలం రేపింది. ఆలయంలో సెల్‌ఫోన్ల వినియోగం నిషేధం ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆలయం అంతర్భాగాలను కూడా చిత్రీకరించడంపై భద్రతా లోపాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ పవిత్రతను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!