
జనరల్

కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆదివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలకు ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
అంకురార్పణకు ముందు సేనాధిపతి విశ్వక్సేనుడు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!