
జనరల్

రేణిగుంట ఎంపీడీవో కార్యాలయం వద్ద జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను అదనపు ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను సమీక్షించి, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకున్న ఏర్పాట్లను పరిశీలించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విధులు నిర్వహించాలని అదనపు ఎస్పీ ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని, కేంద్రం వద్ద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!