

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మరోసారి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల కేటాయింపుపై కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పవన్‌కల్యాణ్ సీఎం నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
సుమారు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశంపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్ చర్చించినట్లు సమాచారం. కూటమిలోని మూడు పార్టీలకు చెందిన ఆశావహులు పలు స్థానాల్లో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్న నేపథ్యంలో, ఆయా ప్రాంతాల్లో ఏకాభిప్రాయం సాధించే అంశంపై ఇరువురు నేతలు దృష్టి సారించారు. గురువారం కూడా చంద్రబాబుతో పవన్‌కల్యాణ్ సమావేశమై స్థానాల కేటాయింపుపై చర్చించిన విషయం తెలిసిందే.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!