

నిమ్స్‌లో పనిచేస్తున్న కొంతమంది ఉన్నతాధికారులపై గతంలోనూ అవినీతి నిరోధకశాఖ చర్యలు చేపట్టిన నేపథ్యంలో తాజా దాడులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తాజాగా నిమ్స్ అదనపు వైద్య సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మి భాస్కర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఏసీబీ నమోదు చేసింది. ఆయన నివాసంతో పాటు సంబంధిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.6.13 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించినట్లు వెల్లడించారు.
నిమ్స్‌లో వైద్య పరికరాల కొనుగోళ్లకు సంబంధించి గతంలోనూ ఏసీబీ విచారణలు, దాడులు జరిగాయి. 2015లో మాజీ డైరెక్టర్ డాక్టర్ ఏ. ధర్మ రక్షక్‌తో పాటు ఇతర అధికారుల ఇళ్లపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. వైద్య పరికరాల కొనుగోలులో టెండర్ నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలపై కేసు నమోదైంది. అనంతరం ఆపరేషన్ థియేటర్ టేబుళ్లు, లైట్లు, వెంటిలేటర్ల కొనుగోళ్లలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఏసీబీ దర్యాప్తులో పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!