

ఎప్పుడూ రంగురంగుల, వెలుగుల ఔట్ఫిట్స్లో కనిపించే రాశి ఖన్నా, ఈసారి గ్రాజియా కోసం ఆల్ బ్లాక్ లుక్‌లో మ్యాజిక్ చేసింది. బ్రేక్‌థ్రూ పెర్ఫార్మర్ అవార్డ్ తీసుకోడానికి వచ్చిన ఆమె, బ్లాక్ పవర్సూట్కి గోల్డ్ ఆభరణాలు జతచేసి బాస్ లేడీ వైబ్‌ను సెట్ చేసింది. ఓపెన్ హెయిర్, మినిమల్ స్టైలింగ్, కాన్ఫిడెంట్ అటిట్యూడ్‌తో ఫోటోఫ్రేమ్ మొత్తాన్నీ అదరగొట్టింది.
ఆమె పోజులు కూడా అంతే అట్రాక్టివ్‌గా ఉన్నాయి. కార్పొరేట్ మీటింగ్ నుంచి బయటికి వచ్చి, కాసేపు పోజులిచ్చినట్టుగా ఫీల్ వచ్చింది. కొంచెం బాసీ, కొంచెం సాసీ, పూర్తిగా కంట్రోల్లో ఉన్న ఆమె ఎనర్జీ, కవర్‌కు బోల్డ్ ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది.
ఇక మరోవైపు, ఫర్హాన్ అక్తర్‌తో కలిసి నటిస్తున్న “120 బహదూర్” సినిమా కోసం బిజీగా ప్రిపేర్ అవుతోంది రాశి. కానీ ఇప్పుడైతే ఆమె ఆల్ బ్లాక్ గ్రాజియా లుక్‌నే అందరూ చర్చిస్తున్నారు. పవర్‌ఫుల్‌గా, స్టైలిష్‌గా, ఫుల్ అటిట్యూడ్‌తో ఉన్న ఈ లుక్‌ను ఫ్యాన్స్ త్వరగా మర్చిపోలేరు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!