

సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ప్రతిపాదిత దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు కీలక ప్రకటన చేసింది. ఈ మూడు రోజుల్లో ఏటీఎం లావాదేవీలపై వర్తించే ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు ఎస్బీఐ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సమ్మె కారణంగా బ్రాంచ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ముఖ్యమైన బ్యాంకింగ్ పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని ఖాతాదారులను సూచించింది.
సమ్మె సమయంలో ఏటీఎంలతో పాటు యోనో, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి డిజిటల్ సేవలను వినియోగించుకోవచ్చని ఎస్బీఐ తెలిపింది. ఇదిలా ఉండగా, ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా సెప్టెంబర్ 27 ఆదివారం ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను సాధారణంగా పనిచేయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు బ్యాంక్ శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం-లింక్డ్ శాఖలు, కరెన్సీ చెస్ట్‌లు పనిచేసేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!