
సినిమాలు

టాటా గ్రూప్ దాతృత్వ సంస్థ టాటా ట్రస్ట్స్‌లో ఇంటి పోరు మళ్లీ తలెత్తింది. రతన్ టాటాకు సన్నిహితుడైన మెహ్లీ మిస్త్రీని తిరిగి ట్రస్టీగా నియమించే తీర్మానాన్ని ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా, టీవీఎస్ గ్రూప్ గౌరవ చైర్మన్ వేణు శ్రీనివాసన్, మాజీ రక్షణ కార్యదర్శి విజయ్ సింగ్ వ్యతిరేకించారు. దీంతో తీర్మానం విఫలమై, మిస్త్రీ పదవీ కాలం ముగిసింది.ఈ పరిణామం టాటా ట్రస్ట్స్‌లో వర్గాల మధ్య ఉన్న విభేదాలు మరింత తీవ్రతరమవుతున్నాయని సూచిస్తోంది. ఒక వర్గం నోయెల్ టాటా వైపు మొగ్గు చూపుతుండగా, మరో వర్గం రతన్ టాటా నమ్మకస్థులతో ఉంది. రతన్ టాటా హయాంలో ఏకాభిప్రాయం ద్వారా జరిగే నిర్ణయాలు ఇప్పుడు విభేదాలు, ఓటింగ్‌లకు దారి తీస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!