
సినిమాలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 09:38 గంటల సమయానికి నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 23,736 వద్దకు చేరుకోగా, సెన్సెక్స్ 169 పాయింట్లు లాభపడి 75,484 వద్ద కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, పెట్టుబడిదారుల నమ్మకంతో మార్కెట్లు పైకి కదులుతున్నాయి.
అంతర్జాతీయంగా అమెరికా డాలర్ ఇండెక్స్ 99.19 వద్ద ఉండగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 105.7 డాలర్లుగా ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.58 శాతానికి చేరాయి. గత సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.08 శాతం పెరగగా, నాస్డాక్ 1.54 శాతం లాభపడింది. ఈ ప్రభావంతో భారత మార్కెట్లు కూడా పాజిటివ్ ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!