

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) రెండు కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్లను లాంచ్ చేసింది. పాలసీహోల్డర్ల అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త ప్లాన్లను రూపొందించింది. ఎల్ఐసీ ప్రొటెక్షన్ ప్లస్ (ప్లాన్ 886), భీమా కవచ్ (887) పేరిట వీటిని అందుబాటులోకి తెచ్చింది. ప్రొటెక్షన్ ప్లస్ అనేది సేవింగ్స్ ప్లాన్ కాగా.. భీమా కవచ్ అనేది ప్యూర్ రిస్క్ ప్రొటెక్షన్ ప్లాన్.
ఎల్ఐసీ ప్రొటెక్షన్ ప్లస్ (plan 886)
ఎల్ఐసీ ప్రొటెక్షన్ ప్లస్ అనేది నాన్ పార్టిసిపేటింగ్, లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే మార్కెట్‌తో అనుసంధానమై ఉంటుంది. ఇందులో భీమా, సేవింగ్స్ ఇమిడి ఉంటాయి. పాలసీ టర్మ్ మొత్తంలో పాలసీదారుడికి రక్షణ ఉంటుంది. పాలసీదారుడు ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌ను (బాండ్ ఫండ్, సెక్యూర్డ్ ఫండ్, బ్యాలెన్స్డ్ ఫండ్, గ్రోత్ ఫండ్, ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్) ఎంచుకోవచ్చు. సమ్ అష్యూర్డ్‌లో మార్పులు చేసుకుంటూ ప్రీమియం పేమెంట్స్‌కు కావాలంటే టాప్-అప్ చేసుకోవచ్చు. పాలసీ ప్రారంభమైన ఐదేళ్ల తర్వాత పాక్షిక ఉపసంహరణలకూ అనుమతి ఉంది. రెగ్యులర్ పే, లిమిటెడ్ పే ఆప్షన్లు ఉన్నాయి.
1.ఈ పాలసీ తీసుకునేందుకు 18 ఏళ్లు, 65 ఏళ్లు కనిష్ఠ, గరిష్ఠ వయసు నిర్ణయించారు.
2.5, 7, 10, 15 ఏళ్లు ప్రీమియం చెల్లింపు కాలాన్ని ఎంచుకోవచ్చు. 10, 15, 20, 25 ఏళ్లు పాలసీ టర్మ్ ఉంటుంది.
3.పాలసీ చెల్లింపు వ్యవధి ఆధారంగా ప్రీమియం ఉంటుంది. గరిష్ఠ మొత్తంపై పరిమితి లేదు.
4.50 ఏళ్లలో ఉండేవారికి కనీస సమ్ అష్యూర్డ్ మొత్తం వార్షిక ప్రీమియానికి 7 రెట్లు, 50 ఏళ్లు పైబడిన వారికి 5 రెట్లుగా నిర్ణయించారు.
5.గరిష్ఠ సమ్ అష్యూర్డ్ అనేది పాలసీ చెల్లింపు గడువు, ప్రీమియం, వయసు వంటివి పరిగణనలోకి తీసుకుంటారు.
6.పాలసీ మెచ్యూరిటీ సమయంలో యూనిట్ ఫండ్ వాల్యూ ఆధారంగా చెల్లింపులు చేస్తారు.
7.పాలసీ సమయంలో పాలసీదారుడికి ఏదైనా జరిగితే బేసిక్ సమ్ అష్యూర్డ్, బేస్ ప్రీమియం ఫండ్ వాల్యూ లేదా రిస్క్ జరిగే నాటికి చెల్లించిన మొత్తం ప్రీమియం మొత్తానికి 105% చెల్లిస్తారు.
8.ఎల్ఐసీ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్‌ను జోడించుకోవచ్చు.
ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల పాలసీ తీసుకుని, 15 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం ₹40,000 చెల్లిస్తే 10 రెట్లు సమ్ అష్యూర్డ్ లభిస్తుంది. బాండ్ ఫండ్‌లో పెట్టితే, 4% రిటర్న్స్‌తో మెచ్యూరిటీకి దాదాపు ₹7.8 లక్షలు, 8% రిటర్న్స్‌తో ₹13.2 లక్షలు రావచ్చు. మరిన్ని వివరాల కోసం ఎల్ఐసీ పాలసీ బ్రోచర్ చూడండి.
1.ఎల్ఐసీ బీమా కవచ్ (ప్లాన్ 887)
ఇది పూర్తిగా నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, ఇండివిడ్యువల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ప్యూర్ రిస్క్ ప్రొటక్షన్ ప్లాన్. కుటుంబ పెద్ద ఎవరైనా తమ కుటుంబానికి ఆర్థిక రక్షణ ఇవ్వడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది. ఇందులో సమ్ అష్యూర్డ్ ఫిక్స్డ్ ఉంచుకోవచ్చు. లేదంటే ఏటా మొత్తాన్ని పెంచుకునే వెసులుబాటూ ఉంది.
1.ఈ పాలసీకి కనిష్ఠ వయసు 18 ఏళ్లు. గరిష్ఠ వయసు 65 ఏళ్లుగా నిర్ణయించారు.
2.కనిష్ఠ మెచ్యూరిటీ వయసు 28 ఏళ్లు కాగా.. గరిష్ఠ వయసు 100 ఏళ్లుగా నిర్ణయించారు.
3.కనీసం రూ.2 కోట్ల బీమా హామీతో ఈ పాలసీ ప్రారంభమవుతుంది. ఆపై రూ.5 లక్షలు చొప్పున ఎంతైనా పెంచుకోవచ్చు. గరిష్ఠ మొత్తంపై పరిమితి లేదు.
4.ప్రీమియాన్ని సింగిల్ పేమెంట్‌లో చెల్లించొచ్చు. లేదంటే 5, 10, 15 ఏళ్లు ప్రీమియం చెల్లింపు వ్యవధి ఎంచుకోవచ్చు. లేదా రెగ్యులర్ పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
5.ప్రీమియం పేమెంట్ టర్మ్ ఆధారంగా ప్రీమియం ఉంటుంది.
ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి ₹2 కోట్ల కవరేజ్‌తో 20 ఏళ్ల పాలసీ తీసుకుంటే, సుమారు ₹19,000 వార్షిక ప్రీమియం ఉంటుంది. మరిన్ని వివరాలకు ఎస్ఐసీ పాలసీ బ్రోచర్ ను పరిశీలించండి..












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!