
రాజకీయాలు

ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరింత ధనవంతుడిగా మారే అవకాశాలు ఉన్నాయని బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా వెల్లడించింది. ప్రస్తుతం ఆయన వ్యక్తిగత సంపద సుమారు 72,600 కోట్ల డాలర్లుగా ఉంది. రాబోయే కాలంలో ఆయన సంపద మరింత పెరిగి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా అవతరించే అవకాశాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది.
మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ఈ నెలలోనే తొలి పబ్లిక్ ఆఫరింగ్‌కు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 5.556 బిలియన్ షేర్లను ఒక్కొక్కటీ 135 డాలర్లకు విక్రయించనున్నారు. ఈ ఐపీఓ ద్వారా సుమారు 750 బిలియన్ డాలర్లు సమీకరించనుంది. కంపెనీ విలువ దాదాపు 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరనుంది. స్పేస్‌ఎక్స్‌లో 82.4 శాతం ఓటింగ్ హక్కులు ఉన్న మస్క్ సంపద ట్రిలియన్ డాలర్ల స్థాయిని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!