

సామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో గ్లోబల్‌గా విడుదల చేయనున్నట్లు అంచనాలు ఉన్నాయి. ఈ ఫ్లాగ్షిప్ లైనప్‌లో గెలాక్సీ S26, గెలాక్సీ S26+, గెలాక్సీ S26 అల్ట్రా అనే మూడు మోడళ్లు ఉండే అవకాశం ఉంది. అయితే, అధికారిక విడుదల తేదీలను సామ్సంగ్ ఇంకా ప్రకటించలేదు. టిప్స్టర్ల సమాచారం ప్రకారం, గ్లోబల్ లాంచ్ తర్వాత దాదాపు నెల రోజులకే ఈ ఫోన్లు అమ్మకాల్లోకి వచ్చే అవకాశం ఉంది.
టిప్స్టర్లు ఫోన్ ఆర్ట్ (@UniverseIce), మొమెంటరీ డిజిటల్ వెల్లడించిన వివరాల ప్రకారం, గెలాక్సీ S26 సిరీస్‌ను 2026 ఫిబ్రవరిలో పరిచయం చేసి, మార్చి 2026 నుంచి విక్రయాలు ప్రారంభించే అవకాశముంది. సామ్సంగ్ ఇటీవల ప్రపంచంలోనే తొలి 2nm ప్రాసెసర్ అయిన ఎక్సినోస్ 2600 చిప్‌సెట్‌ను ఆవిష్కరించిన నేపథ్యంలో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో గెలాక్సీ S26 సిరీస్ ఫోన్లు ఈ ఎక్సినోస్ 2600 చిప్సెట్తో రావచ్చని, ఇతర మార్కెట్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్తో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఎక్సినోస్ 2600 చిప్సెట్ అధునాతన గేట్- ఆల్- అరౌండ్ (GAA) టెక్నాలజీతో రూపొందించబడింది. ఇందులో CPU, GPU, NPUలను ఒకే కాంపాక్ట్ ప్లాట్ఫామ్లో సమగ్రపరచడం వల్ల మెరుగైన ఏఐ పనితీరు, గేమింగ్ సామర్థ్యం లభిస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే, పనితీరులో మెరుగుదలలు ఉన్నప్పటికీ, కెమెరా విభాగంలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రాథమిక గెలాక్సీ S26 మోడల్లో, ఈ ఏడాది విడుదలైన గెలాక్సీ S25లో ఉన్న కెమెరా సెటప్‌నే కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. పెరుగుతున్న తయారీ ఖర్చులను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే, గెలాక్సీ S26 సిరీస్ ధరలు గత మోడళ్లతో పోలిస్తే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. చిప్సెట్లు, మెమరీ భాగాలు, ర్యామ్ వంటి కీలక భాగాల కొనుగోలుకు సామ్సంగ్ భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. పోటీ మార్కెట్లో ధరలను సమతుల్యంగా ఉంచేందుకు, కెమెరా హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్ ప్రణాళికలను తాత్కాలికంగా విరమించుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!