
సినిమాలు

యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మంగళవారం లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 38 బంతుల్లో 93 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతని దూకుడు బ్యాటింగ్ అందరినీ ఆకట్టుకోగా, హాఫ్ సెంచరీ పూర్తయ్యాక చేసిన వినూత్న సెలబ్రేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చేతివేళ్లతో ‘ఎ’ ఆకారాన్ని చూపిస్తూ చేసిన ఆ సెలబ్రేషన్ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది.
మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ మొదట ఆ సెలబ్రేషన్‌కు ప్రత్యేక అర్థం లేదని, ప్రతి మ్యాచ్‌లో కొత్తగా సెలబ్రేట్ చేయాలనేదే తన ఉద్దేశమని తెలిపాడు. అయితే తరువాత అసలు కారణాన్ని వెల్లడించాడు. తన తల్లి ఆర్తీ సూర్యవంశీకి ఈ ఇన్నింగ్స్‌ను అంకితం చేస్తున్నానని, ఆమె పేరులోని మొదటి అక్షరం ‘ఎ’ను సూచించేందుకే ఆ సంకేతం చూపించానని చెప్పాడు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!