
క్రీడలు


ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రాన్ సింగ్ 57 పరుగులతో రాణించగా, అజ్మతుల్లా ఒమర్జాయ్ 38 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు రయన్ రికెల్టన్ 48 పరుగులతో శుభారంభం అందించాడు. మధ్యలో వికెట్లు కోల్పోయినా తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కేవలం 33 బంతుల్లో 75 పరుగులు చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. విల్ జాక్స్ 25 పరుగులతో సహకరించడంతో ముంబై 19.5 ఓవర్లలో 205/4 స్కోరు చేసి ఘన విజయాన్ని నమోదు చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!