

టీ20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్ D మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ జట్టు కెనడాపై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ ఇబ్రాహీం జద్రాన్ అద్భుతంగా ఆడి 56 బంతుల్లో అజేయంగా 95 పరుగులు (7 ఫోర్లు, 5 సిక్సర్లు) సాధించి జట్టుకు బలమైన పునాది వేశాడు. వెల్ ప్లేయ్డ్ ఇబ్రహీం జద్రాన్! క్లిష్ట పరిస్థితుల్లోనూ అతని ఇన్నింగ్స్ జట్టుకు భారీ స్కోరు అందించింది.
జద్రాన్‌కు రహ్మనుల్లా గుర్బాజ్ (20 బంతుల్లో 30) మంచి ఆరంభం ఇచ్చాడు. తరువాత సదీఖుల్లా అతాల్ (32 బంతుల్లో 44)తో కలిసి మూడో వికెట్‌కు 95 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కెనడా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులకే పరిమితమైంది. అఫ్గానిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జట్టుకు భారీ విజయాన్ని అందించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!