

నేటి నుంచి కటక్‌లో ప్రారంభమయ్యే సౌతాఫ్రికా–భారత్ టీ20 సిరీస్ ముందు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు సృష్టించే అంచున నిలబడ్డాడు. బుమ్రా ప్రస్తుతం టీ20 క్రికెట్లో 99 వికెట్లతో ఉన్నాడు. ఈ రోజు(9.12.2025) జరిగే తొలి మ్యాచ్‌లో ఒక్క వికెట్ తీస్తే చాలు.. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లైన టెస్ట్, వన్డే, టీ20 ల్లో 100 వికెట్లు దాటిన తొలి భారతీయ బౌలర్‌గా చరిత్రలో పేరు పెట్టించుకోనున్నాడు.
ఇప్పటికే బుమ్రా దీర్ఘకాల ఫార్మాట్లలో శత వికెట్ల మార్క్‌ను అధిగమించాడు. టెస్టుల్లో 52 మ్యాచుల్లో 234 వికెట్లు, వన్డేల్లో 89 మ్యాచుల్లో 149 వికెట్లు సాధించాడు. టీ20 ల్లో 99 వికెట్లతో శత వికెట్ల ఫీట్‌కు కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నాడు. కాగా అర్ష్‌దీప్ సింగ్ టీ20 ల్లో 100 వికెట్లు పూర్తి చేసినప్పటికీ, మూడు ఫార్మాట్లలో ఈ రికార్డు బుమ్రానే సాధించే అవకాశం ఉంది.
.jpeg&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!