

టి20 ప్రపంచ కప్ 2026 ముంగిట ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ జాబితాను వెల్లడించింది. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో గత కొంతకాలంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ.. తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20 సిరీస్‌లో రెండు మ్యాచుల్లో విఫలమై పాయింట్లు కోల్పోయినప్పటికీ.. 917 పాయింట్లతో అగ్రస్థానం అభిషేక్ శర్మకే దక్కింది.ఈ జాబితాలో అభిషేక్ శర్మ తర్వాత 834 పాయింట్లతో ఫిల్ సాల్ట్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో జోస్ బట్లర్ 769 పాయింట్లతో ఉన్నాడు. కాగా టీమిండియా ప్లేయర్లు తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ కూడా టాప్ 10లో చోటు సంపాదించుకోవడం విశేషం. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌కు దూరమైన తిలక్ వర్మ.. తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి పడిపోయాడు. గత నెలలో సర్జరీ కారణంగా జట్టుకు దూరమైన తిలక్ వర్మ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. అమెరికాతో భారత్ ‘ఏ’ జట్టు ఆడనున్న వార్మప్ మ్యాచ్‌లో ఫిట్నెస్ నిరూపించుకున్న అనంతరం ప్రధాన జట్టుతో చేరనున్నాడు. సరైన సమయంలో ఫామ్‌లోకి వచ్చిన భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తాజా ర్యాంకింగ్స్‌లో మెరుగయ్యాడు. సూర్య ఆరో స్థానానికి ఎగబాకి 728 రేటింగ్ పాయింట్లు సాధించాడు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!