

హ్యామ్‌స్ట్రింగ్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అఫ్గానిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి అడుగుపెట్టనున్నాడు. ఈ ఏడాది జనవరిలో చివరిసారిగా భారత జట్టు తరఫున ఆడిన రోహిత్, ఐపీఎల్ 2026 సందర్భంగా గాయపడడంతో కొంతకాలం ఆటకు దూరమయ్యాడు. అయితే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందిన హిట్‌మ్యాన్ ఇప్పుడు మళ్లీ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. ఈ క్రమంలో రెండు అరుదైన వన్డే రికార్డులను అందుకునే అవకాశముంది.
ప్రస్తుతం 282 వన్డే మ్యాచ్‌లలో 11,577 పరుగులు చేసిన రోహిత్, 12,000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి మరో 423 పరుగుల దూరంలో ఉన్నాడు. అలాగే వన్డేల్లో 1,100 ఫోర్ల క్లబ్‌లో చేరేందుకు కేవలం 11 ఫోర్లు మాత్రమే అవసరం. మొహాలీలో జరిగిన సాధనలో మొదట కొంత తడబడ్డ రోహిత్, ఆ తర్వాత తన లయను అందుకుని స్పిన్నర్లపై భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. వరుస సిక్సర్లు, క్లాసిక్ స్ట్రెయిట్ డ్రైవ్స్‌తో అభిమానుల్లో భారీ అంచనాలు పెంచాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లపై జరగనున్న ఈ సిరీస్‌లో రోహిత్ ఈ రెండు ఘనతలను అందుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!