
గాసిప్స్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మహిళా సెలెక్షన్ కమిటీ చైర్‌పర్సన్‌గా సువర్ణ లక్ష్మి నియమితులయ్యారు. ఈ నియామకానికి ఏకసభ్య కమిటీ చీఫ్, రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావు ఆమోదం తెలిపారు. సువర్ణ లక్ష్మి నేతృత్వంలోని కమిటీలో అనిత మిశ్రా, సంగీత, కీర్తన, ఏక్తా సక్సేనాలను సభ్యులుగా నియమించారు.
కొత్తగా ఏర్పాటైన ఈ మహిళా సెలెక్షన్ కమిటీ ఏడాది పాటు కొనసాగనుంది. ఈ కాలంలో హైదరాబాద్ సీనియర్, జూనియర్ మహిళా క్రికెట్ జట్ల ఎంపిక బాధ్యతలను కమిటీ నిర్వహించనుంది. వివిధ స్థాయిల్లో జరిగే క్రికెట్ పోటీలకు ప్రతిభావంతులైన క్రీడాకారిణులను ఎంపిక చేయడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!