

FIFA వరల్డ్ కప్ 2026 ఫైనల్ డ్రా శుక్రవారం అమెరికా రాజధాని వాషింగ్టన్ DCలో జరగనుంది.ఈ డ్రా ద్వారా మొత్తం 48 జట్లు ఉండే టోర్నమెంట్‌కు 12 గ్రూపుల రూపకల్పన జరుగుతుంది. అమెరికా, కెనడా, మెక్సికో కలిసి నిర్వహిస్తున్న ఈ వరల్డ్ కప్ జూన్ 11, 2026 నుండి ప్రారంభమవుతుంది. గ్రూపులు ఖరారైన తర్వాత, మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను FIFA డిసెంబర్ 6న ప్రకటిస్తుంది.
ఈ కార్యక్రమంలో మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ రియో ఫెర్డినాండ్ డ్రా నిర్వహించనున్నారు. NFL లెజెండ్ టామ్ బ్రాడీ, NBA స్టార్ షాక్విల్ ఒ’నీల్, ఐస్ హాకీ ఐకాన్ వేన్ గ్రెట్జ్కి, MLB స్టార్ ఆరోన్ జడ్జ్, సూపర్ బౌల్ ఛాంపియన్ ఈలి మానింగ్ వంటి ప్రముఖులు కూడా ఈవెంట్‌కు హాజరవుతూ రెడ్ కార్పెట్ సెగ్మెంట్‌ను నిర్వహిస్తారు.
వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన 48 జట్లు పాట్ 1 నుండి పాట్ 4 వరకు ర్యాంకింగ్స్ ఆధారంగా విభజించబడ్డాయి. ఆతిథ్య దేశాలు మెక్సికో (గ్రూప్ A), కెనడా (గ్రూప్ B), USA (గ్రూప్ D) ఇప్పటికే తమ గ్రూపులను పొందాయి. అర్జెంటినా, స్పెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వంటి టాప్ జట్లు పాట్ 1లో ఉన్నాయి. బ్రెజిల్, పోర్చుగల్, నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీ వంటి శక్తివంతమైన జట్లు కూడా టాప్ పాట్లోనే ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్ వంటి కొత్త జట్లు మూడో పాట్లో ఉండగా, ప్లేఆఫ్ జట్లలో ఇటలీ అర్హత సాధిస్తే పాట్ 4లోకి వెళ్ళే అవకాశం ఉంది.
FIFA World Cup 2026 – పాట్ వివరాలు:
పాట్ 1: కెనడా, మెక్సికో, USA, స్పెయిన్, అర్జెంటినా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, బ్రెజిల్, పోర్చుగల్, నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీ
పాట్ 2: క్రోయేషియా, మొరాకో, కొలంబియా, ఉరుగ్వే, స్విట్జర్లాండ్, జపాన్, సెనెగల్, ఇరాన్, దక్షిణ కొరియా, ఈక్వడార్, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా
పాట్ 3: నార్వే, పనామా, ఈజిఫ్ట్, అల్జీరియా, స్కాట్లాండ్, పరాగ్వే, ట్యూనీషియా, ఐవరీ కోస్ట్, ఉజ్బెకిస్తాన్, ఖతార్, దక్షిణ ఆఫ్రికా
పాట్ 4: జోర్డాన్, కేప్ వెర్డ్, కురకావో, ఘనా, హైటి, న్యూజిలాండ్, నలుగురు యూరోపియన్ ప్లేఆఫ్ విజేతలు, ఇద్దరు ఇంటర్కాంటినెంటల్ ప్లేఆఫ్ విజేతలు











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!