
రాజకీయాలు

ఆసియా సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ అజిత్ నారాయణ్ రెండు కాంస్య పతకాలు సాధించాడు. పురుషుల 71 కిలోల విభాగంలో క్లీన్ అండ్ జెర్క్‌లో 174 కేజీలు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. అలాగే మొత్తం 314 కేజీల బరువుతో ఓవరాల్ విభాగంలో కూడా కాంస్య పతకం దక్కించుకున్నాడు.
ఈ టోర్నీలో ఇప్పటికే భారత్ ఖాతాలో ఒక రజతం, రెండు కాంస్య పతకాలు ఉండగా, అజిత్ విజయంతో భారత జట్టు మరో రెండు మెడల్స్ జోడించుకుంది. భారత వెయిట్‌లిఫ్టర్ల ప్రదర్శనపై క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!