

బిగ్ బాస్ సీజన్-9(Bigg Boss-9) ఎట్టకేలకు ఫైనల్స్ కు వచ్చేసింది. ప్రస్తుతం ఈ షో ఎంతో రసవత్తరంగా కొనసాగుతుంది. కళ్యాణ్ పడాల తప్ప అందరూ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రెజెంట్ బిగ్ బిస్ ఆడియన్స్కు హౌస్లో ఉన్న వాళ్ళు వోట్ కి అప్పీల్ చేసుకోవడం కోసం గేమ్స్ కండెక్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో లీడర్ బోర్డులో తక్కువ స్కోర్(100) ఉన్న కారణంగా సుమన్ ఈ పోరు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కానీ అతని దగ్గర ఉన్న లక్ష రూపాయల్లో సగం అండ్ స్కోర్ కూడా సగం హౌస్లో ఉన్న ఒకరికి ఇవ్వాల్సి వస్తుందని చెబుతారు.
అప్పుడు సుమన్ గార్డెన్ ఏరియాలోకి భరణి ని తీసుకొని పోయి నాకు ఈ హౌస్లో ఎవరూ లేరు మీరు తప్ప.. కాబట్టి ఈ స్కోర్ మీకు ట్రాన్స్ఫర్ చేద్దామనుకుంటున్నా అని ఏడుస్తూ అంటాడు. అప్పుడు భరణీ అయితే నాకు ఉపయోగ పడతది లేకపోతే ఈ స్కోర్ ఉపయోగపడే వ్యక్తి ఎవరు చెప్పు అనగానే సుమన్ సంజన అని అంటాడు. అప్పుడు కరెక్ట్ ఈ మనీ అండ్ స్కోర్ ఆమెకు ఇచ్చేయండి అని భరణి అనగానే సుమన్ పోయి సంజనాతో నేను మీకే ఇద్దామనుకుంటున్నా అని అంటాడు.
అప్పుడు సంజన బోరున ఏడుస్తూ రెండు చేతులు జోడించి నాకు ఎవరినైనా అడగాలంటే మొహమాటం అన్నా అని బాగా ఎమోషనల్ అవుతుంది. ఇక ఫైనల్గా బిగ్ బాస్ నేను సంజన గారికి మనీ ట్రాన్స్ఫర్ చేద్దామనుకుంటున్నా అని సుమన్ చెబుతాడు. ప్రస్తుతం ఈ ప్రోమో తెలుగు ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. దీంతో ఏడిపించేశావు బిగ్ బాస్.. నిజంగా భరణి, సుమన్ చాలా మంచివారు.. వాళ్లు హౌస్లో ఉండాలి అని కామెంట్స్ చేస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!