

విడుదల తేదీ: 8 మే 2026
నటీనటులు: దేవ్ మోహన్, లావణ్య త్రిపాఠి, నరేష్, సప్తగిరి, వీటీవీ గణేష్, మొట్ట రాజేంద్రన్ తదితరులు
దర్శకుడు: తాతినేని సత్య
నిర్మాతలు: నాగమోహన్
సంగీత దర్శకుడు: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రాఫర్: బినేంద్ర మీనన్
ఎడిటర్: సతీష్ సూర్య
లీలావతి ఓ సినిమా దర్శకురాలు. ఆమె సైకాలజిస్ట్ రామ్ సేతును ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కానీ సినిమా షూటింగ్స్‌తో ఎప్పుడూ బిజీగా ఉండే లీలా భర్తను పట్టించుకోదు. దీంతో మూడేళ్ల తర్వాత సేతు విడాకులు తీసుకుని నికోలా సెబాస్టియన్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే లీలా ఆ విడాకులకు ఒప్పుకోకుండా తన కాపురాన్ని కాపాడుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తుంది. చివరకు వారి బంధం ఎలా మారింది అన్నదే సినిమా కథ.
లావణ్య త్రిపాఠి నటన సినిమాకు ప్రధాన బలం. భావోద్వేగ సన్నివేశాలు, ఫైట్స్, కామెడీ ఇలా అన్ని రకాల సన్నివేశాల్లో ఆమె మంచి ప్రయత్నం చేసింది. దేవ్ మోహన్ స్టైలిష్‌గా కనిపించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం వినడానికి బాగుంది. హిల్ స్టేషన్ విజువల్స్ ఆకట్టుకుంటాయి.
పాత తరహా కథనం సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది. కామెడీ సన్నివేశాలు పెద్దగా నవ్వించవు. కథనం గందరగోళంగా సాగుతుంది. చాలా పాత్రలు అవసరం లేకుండానే వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. రెండో భాగం మరింత నెమ్మదిగా సాగి ప్రేక్షకులను విసిగిస్తుంది.
దర్శకుడు తాతినేని సత్య రచయితగా, దర్శకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. భార్యాభర్తల బంధంపై మంచి సందేశం ఉన్నప్పటికీ దాన్ని ఆసక్తికరంగా చూపించలేకపోయాడు. మిక్కీ జే మేయర్ పాటలు బాగున్నా సందర్భానికి తగ్గట్టు అనిపించవు. సినిమాటోగ్రఫీ పరంగా కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. ఎడిటింగ్ మరింత కట్టుదిట్టంగా ఉండాల్సింది.
‘సతీ లీలావతి’ మంచి భావోద్వేగ కథాంశాన్ని తీసుకున్నప్పటికీ బలహీనమైన కథనం, పాత తరహా కామెడీ కారణంగా ఆకట్టుకోలేకపోయింది. లావణ్య త్రిపాఠి నటన తప్ప సినిమాలో పెద్దగా గుర్తుంచుకునే అంశాలు కనిపించవు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!