
గాసిప్స్

విశ్వహిందూ పరిషత్ (VHP) జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర కుమార్ జైన్ హైదరాబాద్‌లో గోవధ నిరోధం, దేవాలయాల స్వయం ప్రతిపత్తి, సనాతన ధర్మ రక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గోవధ ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘వీహెచ్‌పి లీగల్ సెల్’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
హిందూ విశ్వాసాలను అవమానించే వ్యాఖ్యలను ఇక సహించబోమని హెచ్చరించిన ఆయన, దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేసి హిందూ సమాజానికి అప్పగించాలని కోరారు. అలాగే మతమార్పిడులను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ‘మోడల్ యాంటీ కన్వర్షన్ లా’ కోసం ఉద్యమం చేపడతామని తెలిపారు. హేట్ స్పీచ్ బిల్లును హిందూ గొంతు నొక్కడానికి ఉపయోగిస్తే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!