
జనరల్

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేసిన వీడియోలో వెల్లడించారు. రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించాలని భావిస్తున్నప్పటికీ, అందుకు ముందు ప్రజలు, అభిమానుల అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు.
ప్రజలు మరియు అభిమానులు తన నిర్ణయానికి మద్దతు ఇస్తే రాజకీయాల్లోకి వస్తానని, లేదంటే ఈ ఆలోచనను విరమించుకుంటానని లారెన్స్ స్పష్టం చేశారు. గత కొంతకాలంగా తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికలో ఆయన పోటీ చేయనున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వీడియో విడుదల కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!