
గాసిప్స్

బీజేపీ నిర్వహిస్తున్న ‘సేవ్ ఇండియా’ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించేందుకు పార్టీ అధిష్టానం ప్రతి రాష్ట్రం నుంచి ముగ్గురు ప్రతినిధులను ఢిల్లీకి ఆహ్వానించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అంశాలతో పాటు పార్టీ సంస్థాగత, రాజకీయ వ్యవహారాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలకు సైతం ఢిల్లీకి రావాలని పిలుపు అందింది.
తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఢిల్లీ సమావేశంలో పాల్గొననున్నట్లు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలంగాణ నేతలతో వివిధ అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. సమావేశంలో చర్చించబోయే అంశాలు, తీసుకునే నిర్ణయాలపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!