

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు వేగం పెరగనుంది. వచ్చే నెలలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ను ఈ వారం విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే భారత ఎన్నికల కమిషన్ కు అధికారికంగా లేఖ రాసింది. కేబినెట్ ఆమోదం లభించడంతో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 121 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే నామినేషన్లు, ప్రచారం, పోలింగ్ వంటి దశలు ప్రారంభం కానున్నాయి.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. అభ్యర్థుల ఎంపిక, స్థానిక సమీకరణల పై పార్టీలు దృష్టి సారిస్తున్నాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!