
న్యూస్

పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి పెరిగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పురులియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలు చేపలు, మాంసం, గుడ్లు తినలేరని ఆమె వ్యాఖ్యానించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. తమ పార్టీ శాంతి, మానవత్వం, సమానత్వానికి కట్టుబడి ఉంటుందని మమతా బెనర్జీ తెలిపారు. బెంగాల్లో నాలుగోసారి అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర సమగ్రతను దెబ్బతీయాలని చేసే ప్రయత్నాలకు రాజకీయంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!