Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

15, మే 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మాజీ సీఎం కేజ్రీవాల్‌పై కోర్టు ధిక్కరణ

10:22 AM, 15 మే, 2026
మాజీ సీఎం కేజ్రీవాల్‌పై కోర్టు ధిక్కరణ

ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌, ముఖ్య నేతలు మనీష్‌ సిసోడియా, సంజయ్‌సింగ్‌, వినయ్‌ మిశ్రా, సౌరభ్‌ భరద్వాజ్‌లపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై సోషల్‌ మీడియా వేదికగా దుష్ప్రచారం సాగించారనే ఆరోపణలపై గురువారం స్వచ్ఛందంగా కోర్టు ధిక్కరణ చర్యలను ప్రారంభించారు. అదే సమయంలో ఈ కేసు విచారణ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు.

2021-22 ఢిల్లీ మద్యం విధానం కేసులో కేజ్రీవాల్‌, టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో సహా 23 మందిని ట్రయల్‌ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. దానిపై సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కానీ జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ వద్ద నుంచి కేసు విచారణను మరో ధర్మాసనానికి మార్చాలని కేజ్రీవాల్‌, ఇతర నేతలు కోరారు. ఈ కేసును విచారించిన జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ కీలక నిర్ణయాలను ప్రకటించారు. కేజ్రీవాల్‌పై తాను కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో.. అదే కేసును తాను విచారించడం సబబు కాదని జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ అభిప్రాయపడ్డారు.

‘‘నేను ఈ కేసు విచారణ కొనసాగిస్తే.. తనపై వ్యక్తిగత కక్షతో తీర్పు ఇచ్చారని కేజ్రీవాల్‌ భావించే అవకాశం ఉంది. అందుకే ఈ కేసును వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని నిర్ణయించా. రాజ్యాంగ ధర్మాన్ని కాపాడే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని వివరించారు. తాను ఒక లా కాలేజీలో ప్రసంగించిన వీడియోను ఉద్దేశపూర్వకంగా ఎడిట్‌ చేసి.. ఆర్‌ఎస్‌ఎస్‌ వేడుకలో మాట్లాడినట్లు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ‘‘కేజ్రీవాల్‌ దుష్ప్రచారానికి తెరలేపారు. న్యాయమూర్తి వీడియోలను ఎడిట్‌ చేసి పోస్ట్‌ చేయడం దురుద్దేశపూరిత చర్య. నన్ను ఎగతాళి చేయాలనేది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. రాజకీయ శక్తుల అంచనాలకు తగ్గట్టు న్యాయమూర్తి నడుచుకోకపోతే, కించపరుస్తామనే సంకేతాన్ని కేజ్రీవాల్‌ పంపుతున్నారు. ఈ ధోరణిని ఉపేక్షిస్తే న్యాయవ్యవస్థకే ముప్పు’’ అని జస్టిస్‌ స్వర్ణకాంత పేర్కొన్నారు. ఇక వినయ్‌ మిశ్రా చేసిన ఒక పోస్ట్‌ను ప్రస్తావిస్తూ.. ‘‘ఈ ఉత్తర్వు న్యాయస్థానంలో జారీ అవుతోంది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో కాదు. వినయ్‌ మిశ్రా.. నేను మీపై ధిక్కార చర్య తీసుకుంటున్నాను, ’’ అని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సనాతన ధర్మంపై వ్యాఖ్యలపై ఉదయనిధి వివరణ

సనాతన ధర్మంపై వ్యాఖ్యలపై ఉదయనిధి వివరణ

స‌నాత‌నం నిర్మూలించ‌డ‌మంటే.. గుళ్ల‌కు వెళ్ల‌క‌పోవ‌డం కాదు–ఉద‌య‌నిధి స్టాలిన్

స‌నాత‌నం నిర్మూలించ‌డ‌మంటే.. గుళ్ల‌కు వెళ్ల‌క‌పోవ‌డం కాదు–ఉద‌య‌నిధి స్టాలిన్

ఇంధన ధరల పెంపుపై మోదీపై కాంగ్రెస్ ఘాటు దాడి

ఇంధన ధరల పెంపుపై మోదీపై కాంగ్రెస్ ఘాటు దాడి

శాసన మండలికి బైక్‌పై వెళ్లిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

శాసన మండలికి బైక్‌పై వెళ్లిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

కేటీఆర్‌తో భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఉన్నత స్థాయి భేటీ

కేటీఆర్‌తో భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఉన్నత స్థాయి భేటీ

హిందూ హక్కుల కోసం విహెచ్‌పి భారీ ఉద్యమమా..

హిందూ హక్కుల కోసం విహెచ్‌పి భారీ ఉద్యమమా..

ట్యాగ్లు
ఢిల్లీ మద్యం కేసుఢిల్లీ హైకోర్టు జడ్జికేజ్రీవాల్ఆప్ నేతలుజస్టిస్ స్వర్ణకాంత శర్మ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలుగు దర్శకుడితో టామ్ క్రూజ్ స్పై థ్రిల్లర్?
గాసిప్స్

తెలుగు దర్శకుడితో టామ్ క్రూజ్ స్పై థ్రిల్లర్?

నీట్ పేపర్ లీక్ తర్వాత రీ ఎగ్జామ్ ప్రకటన
జనరల్

నీట్ పేపర్ లీక్ తర్వాత రీ ఎగ్జామ్ ప్రకటన

ఏఐ షాపింగ్ అసిస్టెంట్ ‘అలెక్సా ఫర్ షాపింగ్’ను విడుదల చేసిన అమెజాన్!
టెక్నాలజీ

ఏఐ షాపింగ్ అసిస్టెంట్ ‘అలెక్సా ఫర్ షాపింగ్’ను విడుదల చేసిన అమెజాన్!

యాప్స్‌ను ఏఐ భర్తీ చేస్తుందా?
టెక్నాలజీ

యాప్స్‌ను ఏఐ భర్తీ చేస్తుందా?

టిమ్స్ ఆసుపత్రులపై కేసీఆర్ విజన్‌ను ప్రస్తావించిన కేటీఆర్
జనరల్

టిమ్స్ ఆసుపత్రులపై కేసీఆర్ విజన్‌ను ప్రస్తావించిన కేటీఆర్

ఓపెన్‌ఏఐపై ఎలాన్ మస్క్ కేసు...
టెక్నాలజీ

ఓపెన్‌ఏఐపై ఎలాన్ మస్క్ కేసు...

సనాతన ధర్మంపై వ్యాఖ్యలపై ఉదయనిధి వివరణ
రాజకీయాలు

సనాతన ధర్మంపై వ్యాఖ్యలపై ఉదయనిధి వివరణ

సీఎం బాధ్యతలకు ముందు శబరిమల దర్శనం ఎందుకు?
జనరల్

సీఎం బాధ్యతలకు ముందు శబరిమల దర్శనం ఎందుకు?

మ్యాచ్ ఫినిష్ చేయడమే నా లక్ష్యం: తిలక్ వర్మ
క్రీడలు

మ్యాచ్ ఫినిష్ చేయడమే నా లక్ష్యం: తిలక్ వర్మ

పెట్రోల్ , డీజిల్ ధరల పెంపుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రియాక్షన్
జనరల్

పెట్రోల్ , డీజిల్ ధరల పెంపుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రియాక్షన్

ప్రేమ పెళ్లికి ముగింపు పలికిన మౌనీరాయ్-సూరజ్ జంట!
సినిమాలు

ప్రేమ పెళ్లికి ముగింపు పలికిన మౌనీరాయ్-సూరజ్ జంట!

రామ్ కొత్త అవతారం పై అభిమానుల్లో హైప్
సినిమాలు

రామ్ కొత్త అవతారం పై అభిమానుల్లో హైప్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!