
జనరల్

తమిళనాడులో ఎర్లీ ఎన్నికల ట్రెండ్స్ సంచలనంగా మారాయి. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) భారీ ఆధిక్యంతో ముందంజలో ఉంది. తాజా లీడ్స్ ప్రకారం టీవీకే 100 సీట్ల మార్క్ దాటగా, అధికార డీఎంకే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రతిపక్ష అన్నాడీఎంకే రెండో స్థానంలో కొనసాగుతుండగా, డీఎంకే కూటమి మూడో స్థానానికి పరిమితమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్ కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
ఈ పరిణామాలతో డీఎంకే కార్యాలయం ముందు టెంట్లు తొలగించినట్లు సమాచారం. తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల్లో విజయ్ ఆధిక్యంలో ఉన్నారు. విజయ్ నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. లెక్కింపు కొనసాగుతున్న వేళ ఈ ట్రెండ్స్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పుకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!