22, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు

Writer: Shivani K 08:10 PM, 22 అక్టోబర్, 2026
డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు

డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు చేసింది. సురక్షిత డ్రైవింగ్‌పై అవగాహన కల్పించేందుకు నిర్వహించే ఆన్‌లైన్ అసెస్‌మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత మార్కులను ప్రస్తుత 60 శాతం నుంచి 75 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. అలాగే, డ్రైవింగ్‌కు సంబంధించిన అవగాహన ట్యుటోరియల్ కనీసం 30 నిమిషాల పాటు ఉండాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రతిపాదనలపై భాగస్వామ్య పక్షాల నుంచి 30 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించిన అనంతరం తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

ముసాయిదా ప్రతిపాదనల ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్‌లో పేరు, చిరునామా మార్పులకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు 15 రోజుల్లోగా ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. తిరస్కరిస్తే అందుకు గల కారణాలను వెల్లడించాలి. చిరునామా మార్పు దరఖాస్తుపై 30 రోజుల్లోగా నిర్ణయం తీసుకోకపోతే ఆమోదం పొందినట్లుగా పరిగణించాలని ప్రతిపాదించారు. ఆధార్ ధ్రువీకరణతో ఆన్‌లైన్‌లో పొందే కొన్ని లైసెన్స్ సేవలకు ఫీజు మినహాయింపు ఇవ్వడంతో పాటు, వ్యక్తిగత వివరాల మార్పులకూ ఛార్జీలు తొలగించాలని భావిస్తున్నారు. గుర్తింపు, వయసు, చిరునామా ధ్రువీకరణకు ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, జనన ధ్రువీకరణ పత్రాలు, విద్యా ధ్రువీకరణ పత్రాలు, ఇ-రేషన్ కార్డు, ఇటీవల జారీ చేసిన విద్యుత్, గ్యాస్ బిల్లులను అనుమతించాలని ప్రతిపాదించారు. చిరునామా ధ్రువీకరణ పత్రాల జాబితా నుంచి ఎల్‌ఐసీ పాలసీలను తొలగించాలని పేర్కొన్నారు. కొత్తగా జారీ చేసే, రెన్యువల్ చేసే డ్రైవింగ్ లైసెన్సులను లామినేటెడ్ లేదా పీవీసీ కార్డు రూపంలో అందించాలని కూడా ముసాయిదాలో సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ద్రవ్యోల్బణం ప్రభావం...వడ్డీ రేట్ల కోతపై ఆర్‌బీఐ వెనకడుగు వేస్తుందా?

ద్రవ్యోల్బణం ప్రభావం...వడ్డీ రేట్ల కోతపై ఆర్‌బీఐ వెనకడుగు వేస్తుందా?

అప్పుల నుంచి బయటపడేందుకు జియో కొత్త వ్యూహం...ఐపీఓపై అందరి చూపు!

అప్పుల నుంచి బయటపడేందుకు జియో కొత్త వ్యూహం...ఐపీఓపై అందరి చూపు!

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్...కొత్త ఛార్జీలు అమల్లోకి

ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్...కొత్త ఛార్జీలు అమల్లోకి

వీజెన్ బయో కార్-టీ చికిత్సకు న్యుసెలియాన్ సాంకేతిక సహకారం

వీజెన్ బయో కార్-టీ చికిత్సకు న్యుసెలియాన్ సాంకేతిక సహకారం

మెటాకు న్యూ మెక్సికో కోర్టులో భారీ జరిమానా..

మెటాకు న్యూ మెక్సికో కోర్టులో భారీ జరిమానా..

ట్యాగ్లు
డ్రైవింగ్ లైసెన్స్కేంద్ర ప్రభుత్వండ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలుఆన్‌లైన్ అసెస్‌మెంట్ పరీక్షసురక్షిత డ్రైవింగ్రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖఆధార్ ధ్రువీకరణలైసెన్స్ ఫీజుచిరునామా మార్పుకొత్త డ్రైవింగ్ నిబంధనలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైభవ్ సూర్యవంశీపై ప్రపంచవ్యాప్తంగా క్రేజ్.. రవిశాస్త్రి కీలక సూచన
క్రీడలు

వైభవ్ సూర్యవంశీపై ప్రపంచవ్యాప్తంగా క్రేజ్.. రవిశాస్త్రి కీలక సూచన

వన్డేల్లో ప్రపంచ రికార్డు.. శుభ్‌మన్‌ గిల్‌ను వెనక్కి నెట్టిన హ్యారీ బ్రూక్‌!
క్రీడలు

వన్డేల్లో ప్రపంచ రికార్డు.. శుభ్‌మన్‌ గిల్‌ను వెనక్కి నెట్టిన హ్యారీ బ్రూక్‌!

నోబెల్‌ తర్వాత పులిట్జర్‌పైనా ట్రంప్‌ కన్ను
జనరల్

నోబెల్‌ తర్వాత పులిట్జర్‌పైనా ట్రంప్‌ కన్ను

‘రియాలిటీ’ నుంచి ‘భజగోవిందం’ పాట విడుదల
సినిమాలు

‘రియాలిటీ’ నుంచి ‘భజగోవిందం’ పాట విడుదల

మోదీకి నెతన్యాహు ప్రత్యేక ఆహ్వానం
జనరల్

మోదీకి నెతన్యాహు ప్రత్యేక ఆహ్వానం

గ్యాంగ్‌వార్‌, గన్‌ఫైట్లు.. ‘అక్క’ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు!
ఓటీటీ

గ్యాంగ్‌వార్‌, గన్‌ఫైట్లు.. ‘అక్క’ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు!

డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు
బిజినెస్

డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు

అట్లాంటిక్‌ మహాసముద్రం పేరు మార్చాలని ట్రంప్‌ ప్రతిపాదన
జనరల్

అట్లాంటిక్‌ మహాసముద్రం పేరు మార్చాలని ట్రంప్‌ ప్రతిపాదన

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు నీటి తరలింపు పై ఆరోపణలు
రాజకీయాలు

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు నీటి తరలింపు పై ఆరోపణలు

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న తేజ సజ్జా
గాసిప్స్

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న తేజ సజ్జా

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ దూకుడు..
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ దూకుడు..

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో రేపటి నుంచి వర్షాలు
జనరల్

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో రేపటి నుంచి వర్షాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!