

తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. ప్రజా జీవితంలో తాను ఎప్పుడూ చట్టాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని పాటిస్తూ వచ్చానని తెలిపారు. తన రాజకీయ జీవితంపై ఎలాంటి మచ్చలేదని, న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. రాజకీయంగా ఎదుర్కోలేని వారు ఇప్పుడు కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపులో భాగమని ఆరోపించారు.
గ్రామీణ స్థాయి నుంచి ఎదిగి కార్పొరేటర్‌గా, ఆపై కేంద్ర మంత్రిగా ఎదిగిన బీసీ నాయకుడి ఎదుగుదలను కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోడీ సభకు ముందు తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ ఆరోపణలు తెరపైకి తెచ్చారని విమర్శించారు. ఈ ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమేనని పేర్కొన్నారు.
నిజం ఏమిటో న్యాయస్థానమే తేలుస్తుందని, ప్రతి కుట్రను కాలమే బయటపెడుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!