

ప్రతి వీకెండ్‌లాగే ఈసారి కూడా కొన్ని కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. తెలుగు చిత్రాలతో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే పెద్దగా ప్రచారం లేకుండా మూడు సినిమాలు నిశ్శబ్దంగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో, ఎక్కడ చూడొచ్చో ఇప్పుడు చూద్దాం.
మొదటగా ‘ఇట్స్ ఓకే గురు’ సినిమా. ఇందులో సాయిచరణ్, ఉషశ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా గత డిసెంబరు 12 న థియేటర్లలో విడుదలైంది. పెద్దగా ప్రచారం లేకపోవడంతో చాలా మందికి తెలియకపోయింది. ఇప్పుడు ఇది అమెజాన్ ప్రైమ్‌లో అద్దె విధానంలో అందుబాటులో ఉంది. జీవితంపై ఆశలు కోల్పోయిన ఓ వ్యక్తి ఎలా విజయ శిఖరాలకు చేరుకున్నాడు? ఆ ప్రయాణంలో ప్రేమ ఎలా సహాయపడింది? అన్నదే కథ.
రెండోది ‘పతంగ్’ అనే తెలుగు సినిమా. ఇది గత డిసెంబరులో థియేటర్లలోకి వచ్చి, ముందుగా సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు ఆహాలో కూడా అందుబాటులో ఉంది. పతంగుల పోటీ మరియు ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేమకథలు ఇష్టపడేవారికి నచ్చుతుంది. మూడోది తమిళ హిట్ సినిమా ‘గెవి’. ఇది ఇప్పటికే సన్ నెక్స్ట్ లో ఉండగా, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అడవి ప్రాంతంలోని ఒక గ్రామంలో కొండచరియలు విరిగిపడటం, సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. దీంతో గ్రామస్తులు పోలీసులపై, రాజకీయ నాయకులపై నిరసన వ్యక్తం చేస్తారు. తర్వాత ఏమైంది అనేదే కథ. ఈ చిత్రానికి దయాలన్ దర్శకత్వం వహించగా, షీలా, జాక్విలిన్ లిడియా ముఖ్య పాత్రల్లో నటించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!