

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించి, నటించిన ‘తన్వి ది గ్రేట్’ (2025) సినిమా అకస్మాత్తుగా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసించారు. ఆటిజంతో బాధపడుతున్న ఒక యువతి ఆర్మీలో చేరాలనే తన కలను ఎలా నెరవేర్చుకుంది అనే భావోద్వేగ కథ ఈ సినిమాలో చూపించారు. ఇందులో శుభంగి దత్తా ప్రధాన పాత్రలో నటించగా, జాకీష్రాఫ్, అరవింద్ స్వామి, బొమన్ ఇరానీ, పల్లవి జోషి, నాజర్ వంటి ప్రముఖులు ముఖ్య పాత్రలు పోషించారు.
‘తన్వి ది గ్రేట్’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇరవై రెండు సంవత్సరాల తర్వాత అనుపమ్ ఖేర్ మళ్లీ దర్శకత్వం వహించారు. గతంలో ఆయన ‘ఓం జై జగదీష్’ (2002) సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. ఎన్ఎఫ్డీసీతో కలిసి అనుపమ్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!