

ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న వెబ్ సిరీస్‌లలో స్ట్రేంజర్ థింగ్స్ ఒకటి. ఈ సిరీస్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫైనల్ సీజన్ అయిన సీజన్ 5 ను మేకర్స్ భాగాలుగా ప్లాన్ చేసి కొన్ని ఎపిసోడ్స్ చొప్పున రిలీజ్ చేస్తూ వస్తున్నారు. గత నవంబర్ లో విడుదలైన సీజన్ 5 పార్ట్ 1 లోని నాలుగు ఎపిసోడ్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.
ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న సీజన్ 5 పార్ట్ 2 రిలీజ్ టైమ్‌ను నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్ లో డిసెంబర్ 25 న వరుసగా సాయంత్రం 5 గంటలు అలాగే 8 గంటల నుంచి ప్రీమియర్స్ పడనున్నాయని కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ టైమింగ్ ప్రకారం మన దగ్గర ఈ సీజన్ డిసెంబర్ 26 న తెల్లవారు 6 గంటల 30 నిమిషాలకు స్ట్రీమ్ కానుంది. లాస్ట్ పార్ట్ కూడా ఇలానే వచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఇది కూడా రానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!