
న్యూస్

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన, సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించిన తెలుగు రొమాంటిక్ డ్రామా ‘శశివదనే’ ఇప్పుడు మరో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే Sun NXTలో ప్రసారం అవుతున్న ఈ చిత్రం, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. దీని ద్వారా మరింత మంది ప్రేక్షకులను చేరుకునే అవకాశం లభిస్తోంది.
థియేటర్లలో ఈ సినిమా సాధారణ స్పందన పొందినప్పటికీ, డిజిటల్ విడుదలతో ప్రేక్షకుల దృష్టిని మళ్లీ ఆకర్షించే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని అహితేజ బెల్లంకొండ నిర్మించగా, సంగీతాన్ని అనుదీప్ దేవ్ సమకూర్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!