

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన తెలుగు సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’ త్వరలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా డిసెంబర్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది.
నవంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, తన భావోద్వేగ కథతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆమని, తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటించారు.
చైతన్య (విక్రాంత్) చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి హైదరాబాద్‌లో ఒంటరిగా జీవించే సాఫ్ట్వేర్ ఉద్యోగి. నగరానికి కొత్తగా వచ్చిన కల్యాణి (చాందినీ)తో అతడికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. ఇద్దరూ పెళ్లికి సిద్ధమవుతారు.
కానీ కల్యాణి తండ్రి ఈశ్వరరావు ఈ పెళ్లికి తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. దీంతో కుటుంబానికి తెలియకుండా చైతన్య, కల్యాణి వివాహం చేసుకుంటారు. తమ సమస్యలకు పరిష్కారం పిల్లలే అన్న నమ్మకంతో వారు సంతాన ప్రయత్నాలు మొదలుపెడతారు.
అయితే పిల్లల విషయంలో ఎదురైన విఫలతలు వారిని సంతాన సాఫల్య కేంద్రం వైపు నడిపిస్తాయి. అక్కడ ఒక ఊహించని నిజం బయటపడుతుంది. ఆ సమస్య ఏమిటి? దాని వల్ల వారి దాంపత్య జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? చైతన్య ఎదుర్కొన్న అవమానాలు ఏమిటి? చివరకు వారు తల్లిదండ్రులయ్యారా లేదా? అన్నదే సినిమా కథ.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!