

ఈ సంక్రాంతి పండుగకు ఓటీటీ వేదికలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మలయాళ చిత్రం ‘కలాంకావల్’ ఇందులో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించారు. మహిళల హత్యల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే కథతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. థియేటర్లలో విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు సోనీ లివ్‌లో అందుబాటులో ఉంది.
తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ నుంచి వచ్చిన రొమాంటిక్ కామెడీ ‘ఇట్లు మీ ఎదవ’ కూడా సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ అవుతోంది. త్రినాథ్ కఠారి హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాహితి హీరోయిన్గా కనిపించింది. అలాగే జీ5 లో ‘గుర్రం పాపిరెడ్డి’, అమెజాన్ ప్రైమ్ వీడియోలో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ‘దండోరా’ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాయి.
ఇక నెట్‌ఫ్లిక్స్‌లో ఇమ్రాన్ హష్మీ నటించిన క్రైమ్ వెబ్‌సిరీస్ ‘తస్కరీ: ది స్మగ్లర్స్’ స్ట్రీమింగ్ అవుతోంది. విమానాశ్రయాల్లో జరిగే బంగారం అక్రమ రవాణా నేపథ్యంగా రూపొందిన ఈ సిరీస్ ఆసక్తికరంగా సాగుతుంది. వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 వేదికలపై మరిన్ని ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మలయాళ చిత్రాలు, సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!