
సినిమాలు

థియేటర్లలో విడుదలైన చిన్నా, పెద్దా సినిమాలు వరుసగా ఓటీటీలోకి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ధనుష్ నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘కర’ కూడా డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమైంది. మమిత బైజుతో కలిసి ధనుష్ నటించిన ఈ చిత్రానికి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. గత నెల 30న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది.
అయితే థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ ఇప్పుడు మే 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. దొంగతనం నేపథ్యంలో తెరకెక్కిన ఈ కథలో ధనుష్ నటన, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ ఓటీటీ రిలీజ్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!