

ఇటీవలి కాలంలో ఓటీటీ సంస్థలు ఇతర భాషా సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు డబ్బింగ్ వెర్షన్లు తీసుకొస్తున్నాయి. ఇటీవల తమిళంలో విడుదలైన ‘సిరై’ చిత్రానికి తెలుగు వెర్షన్ విడుదల చేశారు. ఇప్పుడు మలయాళంలో హిట్ అయిన మరో సినిమా తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులోకి వచ్చింది.
మలయాళంలో ఒకప్పుడు సూపర్‌స్టార్‌గా చెలామణీ అయిన దిలీప్.. 2017 లో హీరోయిన్ భావనపై అత్యాచారం చేయించాడనే ఆరోపణలతో మూడు నెలలు జైలు జీవితం గడిపాడు. ఈ సంఘటన తర్వాత నుంచి దిలీప్ పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. గత నెల అంటే 2025 డిసెంబర్ లో ఈ కేసు నుంచి దిలీప్‌కి పూర్తిగా రిలీఫ్ దక్కింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు నుంచి దిలీప్ పేరు తొలగించారు. ఇది జరిగిన కొన్నిరోజులకే దిలీప్ కొత్త మూవీ 'భా భా భా' థియేటర్లలోకి వచ్చింది.
కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాలో మోహన్ లాల్ కూడా కీలక పాత్ర పోషించాడు. డిసెంబర్ 18 న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి టాక్ పాజిటివ్‌గానే వచ్చింది. ప్రేక్షకులు బాగానే ఆదరించారు. కొన్నిరోజుల క్రితం ఈ చిత్రం జీ5 ఓటీటీలోకి వచ్చింది. అప్పుడు మలయాళం మాత్రమే రాగా.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చినట్లు ప్రకటించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!