
.webp&w=3840&q=75)
చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ నటించిన తాజా స్పోర్ట్స్ డ్రామా ‘బైసన్’ థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, ధృవ్ కెరీర్లోనే అత్యంత పెద్ద హిట్గా నిలిచింది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళనాడులో 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మరో సూపర్ హిట్గా నిలిచింది.
ఇప్పుడీ చిత్రానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన డిజిటల్ రిలీజ్ వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని డిజిటల్ హక్కులతో పొందగా, ఈరోజు నుండి (21వ తేదీ) తమిళం, తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంది.
థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ యాక్షన్–ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాను చూసి ఆనందించవచ్చు. ఈ చిత్రానికి సంగీతం నివాస్ కె. ప్రసన్న అందించగా, నిర్మాణం సమీర్ నాయర్, దీపక్ సీగల్, పా. రంజిత్ మరియు అదితి ఆనంద్ కలిసి నిర్వహించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!