
న్యూస్

ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి: ది బిగినింగ్ మరియు బాహుబలి: ది కంక్లూజన్ సినిమాలను కలిపి థియేటర్లలో ‘బాహుబలి: ది ఎపిక్’గా విడుదల చేసి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు అదే సినిమా డిసెంబర్ 25 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు రానుంది.
పండుగ సీజన్ నేపథ్యంలో ఈ డిజిటల్ విడుదలకు మంచి స్పందన లభించే అవకాశం ఉంది. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం, అద్భుతమైన విజువల్స్, ఎం.ఎం. కీరవాణి సంగీతంతో భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తృత ప్రేక్షకులను చేరుకోనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!