

తిరుమల శ్రీవారి సన్నిధిలో బుల్లితెర నటి, బిగ్‌బాస్ సీజన్ 9 రన్నరప్ తనూజ పుట్టిన రోజు వేడులు ఇప్పుడు వివాదంగా మారాయి. ఆమె పుట్టిన రోజు సందర్భంగా కొండపై దివ్వెల మాధురి కేక్ కట్ చేయడంతో విమర్శలు వస్తున్నాయి. ఇది ఆలయ పవిత్రతకు విరుద్దమని, కొండపై కేక్‌లు నిషేధమైనా ఎలా వెళ్లాయనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది.
గతంలో ఓసారి పోలీసు కేసు నమోదైనప్పటికీ దివ్వెల మాధురి తీరు మారలేదు. గురువారం బిగ్‌బాస్ సీజన్ 9 రన్నరప్ తనూజ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మాధురి సెలబ్రేట్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తిరుమలకు బర్త్‌డే కేకులు తీసుకురావడం నిషేధం పటి ష్టమైన సెక్యూరిటీ ఉండగా మాధురి కేకు ఎలా తీసుకొచ్చారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.ఇటీవల బిగ్‌బాస్ షో పోటీదారు. గీతూ రాయల్ కొంతమంది యువకులతో కలిసి ఆలయం వద్ద, ఘాట్ రోడ్డులో సినిమా పాటకు డ్యాన్స్ చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!