

తెలుగు రాష్ట్రాల్లో డీజిల్ లభ్యత తగ్గడంతో సినిమా ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం పడుతోంది. హైదరాబాద్‌లో పలు కీలక షూటింగ్ షెడ్యూల్స్ రద్దు చేయవలసి వచ్చింది. భారీ జనరేటర్లు, కెమెరాలు, ఎడిటింగ్ యూనిట్లు, నటీనటుల క్యారవాన్లలో ఏసీలు నడపడానికి గంటకు వందల లీటర్ల డీజిల్ అవసరం పడుతుంది. ఒక్కరోజు షూటింగ్ ఆగిపోతే నిర్మాతలకు లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోంది. జూన్, జూలైలో విడుదల కావాల్సిన చిత్రాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆలస్యం కావొచ్చని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు గుంటూరు, తిరుపతి వంటి ప్రాంతాల్లో కూడా ఈ సమస్య తలెత్తింది.
ప్రస్తుతం పానిక్ బయింగ్ వల్ల డీజిల్ స్టాక్ త్వరగా అయిపోతోందని అధికారులు చెబుతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే డిమాండ్ భారీగా పెరిగింది. సినిమా యూనిట్లు బ్లాక్ మార్కెట్ నుంచి డీజిల్ కొనుగోలు చేసి షూటింగ్ కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇది ఖర్చులను మరింత పెంచుతోంది.నిర్మాతల సంఘాలు ప్రభుత్వానికి వినతి పెట్టి త్వరగా సమస్య పరిష్కరించాలని కోరుతున్నాయి. డీజిల్ సరఫరా సాఫీగా జరిగితేనే షెడ్యూల్స్ సకాలంలో పూర్తి చేయవచ్చు. లేకపోతే ఎన్నో చిత్రాల విడుదల తేదీలు మారవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఈ కష్టకాలం నుంచి త్వరగా బయటపడాలని అందరూ ఆశిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!