

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ “వృషభ” నుంచి బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ‘చిన్ని చిన్ని..’ విడుదలైంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఈ నెల 25 న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. నందకిషోర్ దర్శకత్వంలో మలయాళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్ సహా పలువురు నిర్మాతలు నిర్మిస్తున్నారు.
సమర్జీత్ లంకేష్, నయన్ సారికపై చిత్రీకరించిన ‘చిన్ని చిన్ని..’ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ రాయగా, అనురాగ్ కులకర్ణి భావోద్వేగంగా ఆలపించారు. సామ్ సీఎస్ మధురమైన ట్యూన్‌తో ఈ పాటను కంపోజ్ చేశారు. పునర్జన్మల నేపథ్యంతో, హై టెక్నికల్ వాల్యూస్ మరియు స్టార్ కాస్ట్‌తో రూపొందుతున్న “వృషభ” సినిమా విజువల్ వండర్‌గా ప్రేక్షకులను అలరించనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!