

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో రూపొందుతున్న హాస్య చిత్రం ‘ఫంకీ’ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రైలర్ పూర్తిగా వినోదభరితంగా సాగుతూ, కె.వి. అనుదీప్ ట్రేడ్‌మార్క్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. విశ్వక్ సేన్, కయాదు లోహర్ మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ట్రైలర్ లాంచ్‌లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, ‘ఫంకీ’ సినిమా రెండు గంటలకు పైగా ప్రేక్షకులను నిరంతరం నవ్విస్తుందని అన్నారు. కయాదు లోహర్, దర్శకుడు అనుదీప్, నిర్మాత నాగవంశీ కూడా సినిమా పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అదనపు బలంగా నిలవనుంది. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈ నెల 13 న విడుదల కానున్న ‘ఫంకీ’ పై అంచనాలు ట్రైలర్‌తో మరింత పెరిగాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!