
జనరల్

తమిళ సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా ఎదిగిన దళపతి విజయ్, ఇప్పుడు సినిమాలకు వీడ్కోలు చెబుతూ రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారు. దాదాపు మూడు దశాబ్దాల కెరీర్లో ఆయన తుపాకి, కత్తి, మెర్సల్ వంటి బ్లాక్బస్టర్లతో రజినీకాంత్ స్థాయికి సమానమైన క్రేజ్ సంపాదించారు. ప్రస్తుతం షూటింగ్లో ఉన్న ‘జననాయగన్’ ఆయన చివరి సినిమా కావొచ్చని సమాచారం.
ఈ చిత్రాన్ని విజయ్ తన సినీ ప్రయాణానికి భావోద్వేగ ముగింపుగా ప్లాన్ చేస్తున్నాడట. చివరి సన్నివేశంలో దర్శకులు అట్లీ, లోకేష్ కనకరాజ్, నెల్సన్ దిలీప్కుమార్తో కలిసి కనిపించి వారికి ఒక బ్యాటన్ అందించే సన్నివేశం ఉంటుంది. చివరగా ‘దళపతి కచేరి’ పాటకు విజయ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ చేస్తూ, అభిమానులకు అభివాదం చేస్తూ సినిమా ముగుస్తుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (1)
Vijay’s legacy will live on forever