

విజయ్ ప్రధాన పాత్రలో హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జన నాయగన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజకీయాల్లో పూర్తిస్థాయిలో ప్రవేశించే ముందు విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానులు, సినీ వర్గాల్లో ప్రత్యేక ఆసక్తి ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.15 కోట్ల వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఈ చిత్రం తెలుగులో హిట్ అయిన భగవంత్ కేసరి కి రీమేక్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై స్పందించిన దర్శకుడు హెచ్. వినోద్, ఈ విషయాన్ని తాను ధ్రువీకరించనని, అలాగే ఖండించనని చెప్పారు. ఇది రీమేకా? లేక ప్రేరణతో రూపొందించారా? అనే అంశాలపై ప్రేక్షకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సినిమాను ఓపెన్ మైండ్‌తో చూడాలని ఆయన సూచించారు.ఈనెల 3న విడుదల కానున్న ట్రైలర్‌తో ఈ చిత్రంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!